డి.హిరేహాల్ మండలంలోని మురడి గ్రామంలో రైతన్నా మీ కోసం కార్యక్రమంలో బాగంగా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. బుధవారం మద్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో రైతుల అనుభవాలు, వారికి ప్రభుత్వం నుంచి అందిస్తున్న సబ్సిడీ? సంక్షేమ పథకాలు అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పలువురు మాట్లాడుతూ తాము మొక్కజొన్న, కంది పంటలు సాగుచేశామని ప్రభుత్వం మంజూరు చేసిన డ్రిప్ సబ్సిడీ తో సూక్మ బిందు సేద్యం చేసి అధిక దిగుబడులు పొందామని వెల్లడించారు. కార్యక్రమంలో జెడిఏ ఉమామహేశ్వరమ్మ, ఏడిఏ పద్మజ, ఎంపిటిసి గంగాధర్, పాల్గొన్నారు.