అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం మూడు గంటల పది నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మెగా పేరెంట్ టీచర్స్ 3.0 సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్ 3.0 ముఖ్యంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మధ్య సమావేశం నిర్వహించి తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా స్థాయి ఆరోగ్యం స్పోర్ట్స్ తదితర అంశాల్లో ఏ స్థాయిలో ఉన్నారో వివరించి, అదే విధంగా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వారి హోం వర్క్ ను తల్లిదండ్రులు తప్పనిసరిగా పరిశీలించి విద్యార్థి అభివృద్ధికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు.