కనిగిరి: పెద్ద చెర్లోపల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
పెద చెల్లోపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమైన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ... విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలను నిర్వహిస్తున్నారు అన్నారు. ఈ సమావేశాల ద్వారా విద్యార్థుల విద్యా పురోగతిని తెలుసుకోవడంతోపాటు, విద్యాభివృద్ధికితీసుకోవలసిన చర్యలపై చర్చించవచ్చు అన్నారు.