పంట నష్టపై అంచనా వేసి రైతులకు పరిహారమందేలా చూస్తాం: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Nov 1, 2025
మంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పర్యటిచ్చిన కలెక్టర్ రాజాబాబు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఇప్పటికే అధికారులకు నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశామని అతి త్వరలో నివేదికను సీఎం కి పంపించి నష్టపరిహారం అందేలా చూస్తామని మీడియాకు కలెక్టర్ రాజబాబు తెలిపారు.