ఇబ్రహీంపట్నం: బండ్లగూడలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన స్థానిక ప్రజలు
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ రెండో వార్డ్ కాలనీవాసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను సోమవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేతో తమ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికారులతో మాట్లాడి కాలనీలో ఎటువంటి సమస్యలున్న పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం స్థానికులతో కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.