బాల్కొండ: ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ
బాల్కొండ నియోజకవర్గం లోని ఎస్సారెస్పీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ సందర్శించారు. బుధవారం అదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో పోచంపాడ్ గెస్ట్ హౌస్ వద్ద కొద్దిసేపు బస చేశారు. ఆయనకు పలువురు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఎస్సారెస్పీని సందర్శించారు.