అనంతపురం నగరంలో చైన్ స్నాచర్లు హల్చల్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కోవూర్ నగర్ లో ఇద్దరు దుండగులు మహిళా మెడలో చైన్ లాక్కెళ్ళిన సంఘటన కలకలం రేపింది. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. కోవూర్ నగర్ కి చెందిన మాధవి లత అనే మహిళ ఉదయం శివాలయానికి వెళుతున్న సమయంలో వెనకవైపు నుంచి ద్విచక్ర వాహనంలో వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో చైన్ లాక్కెళ్లారు మహిళ కింద పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు.