కరీంనగర్: నగరంలో ఓ గుంతలు పడిన రోడ్డు ను బాగు చేయాలని వినూత్న నిరసన, చిన్నపాటి వర్షానికి బురదమయం అవుతుంది
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోతి రాపూర్ 9వ డివిజన్ లో రాము అనే వ్యక్తి కుటుంబ సభ్యులు వినూత్నంగా బుధవారం నిరసన చేపట్టారు. చిన్న వర్షం కురిస్తే నే రోడ్లు అధ్వానంగా అవుతున్నాయని, పిల్లలు స్కూల్ కు వెళ్లడం, కాలనీ ప్రజలు పనులకు వెళ్లడం కష్ట సాధ్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై నాటు వేస్తూ, ప్లే కార్డ్స్ పట్టుకొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంటి పన్ను వసూలు చేసేటప్పుడు ఉన్న శ్రద్ధ రోడ్లు మరమ్మత్తులు చేసేటప్పుడు ఎందుకు ఉండాలని విమర్శించారు. వెంటనే రోడ్లు మరమ్మత్తు చేయాలని లేదంటే, మా పన్నుల డబ్బులు మాకు ఇవ్వాలని మున్సిపల్ అధికారులు డిమాండ్ చేశారు.