ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తన టిడిపి కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలపై వారు ఇస్తున్న అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అర్జీదారులకు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు.