ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జి కందుల రామిరెడ్డి, కమిషనర్ నారాయణరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు