ఆత్మకూరు పట్టణంలో 60 మంది చెంచులకు ఒకేసారి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి,భోజన సదుపాయం కల్పించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్
ఆత్మకూరు పట్టణంలోని బ్రేక్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ AVSN రెడ్డి నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బ్రేక్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి చెంచులకు డ్రైవింగ్ లైసెన్స్ లు ఇవ్వాలని కోరగా స్పందించిన అధికారి అడవి బిడ్డలైన చెంచులకు ఒకేసారి 60 మందికి డ్రైవింగ్ లైసెన్స్ లు మంజూరు చేసి డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన అడవి బిడ్డలకు తన సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటుచేసి దగ్గరుండి పంపిణీ చేశారు. సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ చదువు లేకపోయినా కేవలం ఆధార్ కార్డుల ఆధారంగా డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు చేయడం జరిగిందన్నారు.