రాళ్లపాడు రైతుల కళ్లలో ఆనందం చూడడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం లింగసముద్రం (M) రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి పంట కాలువలకు నీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి, రైతుల ఇళ్లలో సిరులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 20 అడుగుల నీరు ఉందని వరిసాగు కోసం నీటిని విడుదల చేస్తున్నామని MLA తెలిపారు.