కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాటా చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి : మిల్కూరి వాసుదేవరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి.
భూమి కోసం,భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండా నాయకత్వంలో దున్నేవానికి భూమి కావాలని, తెలంగాణ సాయుధ రైతాంగ విరోచిత పోరాటం చేసింది కమ్యూనిస్టు పార్టీ అని ఈ పోరాటంలో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ చరిత్రను వక్రీకరిస్తూ మతం రంగు పులుముతూ హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తుందని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి విమర్శించారు. మంగళవారం సాయంత్రం 7గంటలకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా బస్టాండ్ నుండి అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం వరకు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ కాగడాల ప్రదర్శన చేశారు.