కావలి పట్టణంలోని ఏటూరి రామిరెడ్డి తోటలో ఈ నెల 16వ తేదీన జరగనున్న కాపుల కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కాపు సంఘ నాయకులు ఆహ్వానించారు. మంగళవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సంఘ ప్రముఖులు, కార్యక్రమం వివరాలను వివరించి, ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు.