అసిఫాబాద్: ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో మహిళ మిస్సింగ్ కేసు నమోదు
ఆసిఫాబాద్ మండలం,అంకుశాపూర్ కు చెందిన జంగంపల్లి పద్మ (32) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 15న తన పుట్టింటికి వెళతానని భర్త రాజేశ్వర్ కు చెప్పి వెళ్లింది. కానీ ఆమె పుట్టింటికి కూడా వెళ్లలేదన్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.