బైపాస్ రోడ్డు పనులను వేగంగా చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ పరిధిలోని కనేకల్లు క్రాస్ నుంచి గుంతకల్లు రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను మంగళవారం మంత్రి పరిశీలించారు.బైపాస్ రోడ్డు పనులను వేగంగా త్వరితగతిన 3 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు పనులను పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్.అండ్.బి ఏఈ నాగభూషణం, సూపర్ వైజర్ సుంకన్న, తదితరులు పాల్గొన్నారు.