హిమాయత్ నగర్: సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దని స్థానికులు ఆందోళన, కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్
సికింద్రాబాద్లోని తిరుమలగిరి పరిధిలో నూతన వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు మహిళలు సోమవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. మహిళలు రాస్తారోకో నిర్వహించడంతో కిలోమీటర్ మేరా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ స్థలం బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ స్థలం కావడంతో కార్పు మాజీ కార్పొరేటర్ వెంటనే దిగిరావాలని వారు ఆందోళన తెలిపారు. వైన్ షాప్ పెట్టొద్దని స్థానికులు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.