ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ లోని ఆటో సాయి నగర్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులతో అభివృద్ధి పనులపై చర్చించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని ఆటో సాయి నగర్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులను కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం శాలువాతో సత్కరించి కాలనీలో అభివృద్ధి పరంగా చేపట్టవలసిన కార్యక్రమాలు భవిష్యత్తులో అమలు చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి సమావేశంలో వారికి వివరించారు. నూతన కార్యవర్గం సాదశపాయంగా పనిచేసే కాలనీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి కొనసాగించాలని కోరారు. అవసరమైన ప్రతి విషయంలో పూర్తిస్థాయి సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు.