మంచిర్యాల: 190 జీఓ విడుదలపై హర్షం వ్యక్తం చేసిన టీజీఈ జేఏసీ
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు, డిప్యూటేషన్లకు ప్రభుత్వం 190 జీఓ విడుదల చేయడం పట్ల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీఓ 317 బాధితుల పక్షాన టీజీఈ జేఏసీ చేసిన నిరంతర పోరాటంతో ప్రభుత్వం 190 జీఓ జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, కేబినెట్ సబ్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.