ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండం చర్ల గ్రామానికి చెందిన పెద్ద పిరమ్మ వృద్ధాప్యంతో మంచానికే పరిమితమైంది. ఆమె కోడలు కొడుకు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దారవీడు ఎస్సై సాంబశివయ్య గుండం చర్ల గ్రామానికి వెళ్లి వృద్ధురాలి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కోడలు బీజమ్మ కుమారుడు కాసిం పీరాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వృద్ధురాలిని సంరక్షించడం కుటుంబ సభ్యుల బాధ్యత అని హెచ్చరించారు. సీనియర్ సిటిజన్ రక్షణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కౌన్సిలింగ్ అనంతరం వృద్ధురాలిని బాగా చూసుకుంటామని కోడలు కుమారుడు తెలిపారు