అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలో శనివారం వైద్య ఆరోగ్యశాఖ, గ్రామపంచాయతీ సిబ్బంది కలసి దోమల నివారణపై ప్రజలకు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విడపనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జహానా ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ లు వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించి జాతీయ కీటక జనితవ్యాధుల నియంత్రణ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలు డ్రై డే పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు.