మంగళగిరి: సీఎం చంద్రబాబు కలలకన్నా రాజధానిని ఎప్పటికీ పూర్తి కాదు: మాజీమంత్రి అంబటి రాంబాబు
సీఎం చంద్రబాబు కలలు కంటున్న రాజధాని ఎప్పటికీ పూర్తి కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్లను మూడేళ్లలో నిర్మించగలరా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మేస్తారా అని నిలదీశారు. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదని, మరి ఇసుక, ఆదాయం ఎవరి చేతిలోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు.