ప్రొద్దుటూరు గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఆలయంపై విగ్రహాలు ద్వంసం
Machilipatnam South, Krishna | Sep 16, 2025
కంకిపాడు మండలం టోల్ గేట్ సమీపంలో ప్రొద్దుటూరు గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఆలయంపై దుండగులు దాడి చేసి విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేసిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల పదిరోజులలో ప్రారంభానికి సిద్దమవుతున్న వెంకటేశ్వరస్వామి గుడి గోపురంపై ఏర్పాటు చేసిన అమ్మవార్ల విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాలు ద్వంసంపై పోలీసులకు పిర్యాదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.