యూటిఎఫ్ పదవతరగతి మోడల్ టెస్ట్ పేపర్స్ ను కురిచేడు మండలవిద్యా వనరులకేంద్రం నందు మండల పరిషత్ అధ్యక్షురాలు బెల్లం కోటేశ్వరమ్మ,జెడ్పిటిసి వెంకటనాగిరెడ్డిలు ఆవిష్కరించారు,ఈసందర్భంగా జడ్పీటీసీ నాగిరెడ్డి మాట్లాడుతూపదవతరగతి విద్యార్థులు ఈటెస్ట్ పేపర్స్ ను వినియోగించుకుని,ఉత్తమఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు అన్నెం అరుణ,షేక్ ఖాసింబీ,యంపీడీవో సత్యవరప్రసాద్,మండలవిద్యాశాఖ అధికారులు వస్త్రం నాయక్,సీహెచ్ సుబ్బారావు,యూటీఎఫ్ మండలశాఖ గౌరవాధ్యక్షులుషేక్ ఖాదర్ వలి,అధ్యక్షులు అన్నెం శ్రీనివాస రెడ్డి,ప్రధానకార్యదర్శి ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.