బాల్కొండ: తాళ్లరాంపూర్ గ్రామంలో గీత కార్మికులు, గ్రామ బుద్ధి కమిటీ మధ్య జరిగిన ఉదృత పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గీత కార్మికులు, గ్రామాభివృద్ధి కమిటీ మధ్య సోమవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. మంగళవారం గ్రామంలో ప్రత్యేక బలగాలతో పోలీసులు బందోబస్తు నిర్వహించి, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామస్థులు ఎవరు కూడా బయటకు రావద్దని సూచించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.