మంత్రుల పర్యటనను సక్సెస్ చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు టు బిహెచ్కె కాలనీ ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండి గౌతమ్ తో కలిసి సందర్శించారు. సి ఎస్ ఆర్ నిధులతో కాలనీలో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నత పాఠశాల పార్క్ నిర్మాణ పనులకు సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిలు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.