శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశాలతో టిడిపి పెనుకొండ పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో సోమవారం భారత మహిళా జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ గెలవడంపై సంబరాలు చేసుకున్నారు. బాణా సంచా పేల్చి జాతీయ జెండాలను ప్రదర్శించారు. జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు.