అదిలాబాద్ అర్బన్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించిన ఎంపీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలోతో నిజాం సర్కార్ కాళ్లబేరానికి వచ్చి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలినం చేసిందని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రంమలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ పాల్గొన్నారు.