రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగాఉండాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో సీజనల్ వ్యాధులు, వరిధాన్యసేకరణ, ఎరువులసరఫరా, ప్రభుత్వ సేవలపై ప్రజా స్పందన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడు తూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజన్ వ్యాధులకు ప్రజలు గురికాకుండా పారిశుద్ధ్య కార్యక్రమా లుముమ్మరంగా చేపట్టాలని ఆయన చెప్పారు. జిల్లాల్లో పారిశుధ్యం తోపాటు సురక్షితమైన త్రాగు నీటిని ప్రజలకు సరఫరాచేయాలని అన్నార