ఇబ్రహీంపట్నం: మియాపూర్ లో నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు
మియాపూర్ లో హైడ్రాధికారులు నాలా ఆక్రమణలపై ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. పటేల్ చెరువు నుంచి గంగారం చెరువుకు వెళ్లే నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో కూల్చివేశారు. నాలను శ్రీ చైతన్య కళాశాల తమ క్రీడా మైదానానికి అడ్డుగా మట్టిని నింపి కబ్జా చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించి నాలా మార్గంలో ఉన్న మట్టిని జెసిబిల సహాయంతో ఆదివారం ఉదయం తీసివేసి అక్రమ నిర్మాణాలను తొలగించారు.