కనిగిరి: ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి కొండారెడ్డి అన్నారు. కనిగిరి పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కేశవరావు, ఐద్వా నాయకురాలు లక్ష్మీ ప్రసన్న, సిఐటియు నాయకులు పిచ్చయ్యపై పెట్టిన అక్రమ కేసులను పోలీసులు రద్దుచేసి, వారిని విడుదల చేయాలన్నారు.