ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలోని కాశీనాయన ఆశ్రమం వద్ద 30వ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలను నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఎడ్ల పందాలు పోటీలను తిలకించారు. విజేతలకు 60 వేల రూపాయలు నగదు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.