హిమాయత్ నగర్: లాలాపేటలోని జయశంకర్ స్టేడియం వద్ద అందెశ్రీ పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి కేటీఆర్
ప్రముఖ తెలంగాణ కవి రచయిత అందెశ్రీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలాపేటలోని జయశంకర్ స్టేడియం వద్ద అందెశ్రీకి మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకగా నిలిచిందని గుర్తు చేశారు. అందెశ్రీ తెలంగాణ ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటారని తెలిపారు. గొప్ప కవిని తెలంగాణ కోల్పోయిందని అన్నారు.