రాయదుర్గం: పట్టణంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు, మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి నేతలు
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో బిజెపి నాయకులుబైక్ ర్యాలీ నిర్వహించి వినాయక కూడలిలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బుధవారం ఉదయం బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి హీరోజీరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా వసుంధర దేవి, సీనియర్ నాయకులు అంబాజీరావు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఆయన మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని దేశ ప్రజలకు తన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సేవా పక్వాడా కార్యక్రమాలలో భాగంగా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.