యాడికి మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో మండల విద్యాశాఖ అధికారి కాశప్ప హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రుల మధ్య సమన్వయం కోసం పేరెంట్స్ మీటింగ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడతాయన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాగా కష్టపడి చదవాలన్నారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.