నందికొట్కూరును కర్నూలు జిల్లాలో కలపాలని రాజకీయ పార్టీలు నివేదిక ఇవ్వాలని:CPIML లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు
పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పార్టీ కార్యాలయంలో బుధవారం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నందికొట్కూరు ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి కేవలం 30 కి.మీ దూరంలో ఉన్న కర్నూలు జిల్లాకు కాకుండా 70.కి.మీ దూరంలో ఉన్న నంద్యాల జిల్లాకు కలపడం వల్ల రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యం కోసం,విద్యా,ఉపాధి అవకాశాల కోసం, నందికొట్కూరును కర్నూలు జిల్లాతో అను