రాయచోటి కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి వేడుకలు
రాయచోటి కలెక్టరేట్ PGRS హాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి బుధవారం వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్వో మధుసూదన్ రావు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేతివృత్తుల వారు, హస్తకళాకారులు, పారిశ్రామిక కార్మికులు విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.