మార్కాపురం: 15వ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైపోయిన పూరిగుడిసె
ప్రకాశం జిల్లా మార్కాపురం 15వ వార్డులో కోయా జంగాల కాలనీకి చెందిన సింగారి గంగయ్య అంకాలమ్మ నివాసం అంటున్నారు. పూరి గుడిసె ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. షార్ట్ సర్క్యూట్ తో ఈ సంఘటన చోటు చేసుకుని ఉంటుందని స్థానికులు తెలిపారు దీంతో ఇంట్లో ఉన్న వస్తువులు, ఎలక్ట్రికల్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. 20వేల రూపాయల నగదు కూడా కాలిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు