నాగర్ కర్నూల్: ప్రజా పాలనా దినోత్సవ వేడుకకు విస్తృత ఏర్పాట్లను చేయండి : జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్
ఈనెల 17న నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవం వేడుకలకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు.