మంగళగిరి: ఎన్టీఆర్ ను ఎన్ని పోటు పొడిచి తిరిగి పొగడడం చంద్రబాబుకే చెల్లుతుంది: వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి
ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజపేయి ఆయన గురించి ఆరా తీశారని, కానీ ఎన్టీఆర్ వల్ల లబ్ధి పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లిందని, చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయని, ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబేనని ఆమె విమర్శించారు.