పాడేరు వినాయక ఉత్సవాల్లో ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ ఆర్థిక సహాయం
అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతల వీధి వద్ద గత నెల 31వ తేదీన వినాయక ఉత్సవాల్లో స్కార్పియో ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు చెందిన విషయం విధితమే. మృతుల కుటుంబాలకు రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గణేష్ ఉత్సవ కమిటీ జిల్లా కార్యదర్శి నరేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయలు చొప్పున పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ చేతుల మీదుగా అందజేశారు. వారు మాట్లాడుతూ హిందూ సంప్రదాయం ప్రకారం చక్కటి కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని, ప్రభుత్వం నుంచి రావలసిన సహాయం అందిస్తామని తెలిపారు.