నారాయణపేట్: మక్తల్ మినీ స్టేడియంలో ప్రారంభమైన అథ్లెటిక్స్ పోటీలు
జిల్లా స్థాయి అథ్లెటిక్ 14 మరియు 17 సంవత్సరాల బాల బాలికల ఎంపికలు సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ మినీ స్టేడియం లో జిల్లా యువజన క్రీడా అధికారి చెట్టి వెంకటేష్ ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృడత్వానికి ఉపయోగ పడతాయని అన్నారు. ఉన్నత చదువులు ఉద్యోగాలలో క్రీడల ద్వారా కూడా రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు.