సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం దామాజిపల్లి గ్రామంలో సోమవారం 11:45 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకటో తారీకు ఉదయమే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని భవిష్యత్తులో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్న. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలు పాల్గొన్నారు.