షెడ్యూల్ ప్రకారం వీధి సునకాలకు స్టెరిలైజేషన్ ప్రక్రియ : కమిషనర్ నరసింహ ప్రసాద్
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నగరంలోని వీధి సునకాలకు స్టెరిలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రజా ఆరోగ్య విభాగం అధికారుల ఆదేశించారు బుధవారం సాయంత్రం కమిషనర్ వాహనాల షెడ్డులో ఏర్పాటుచేసిన అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను తనిఖీ చేశారు వీధి సునకాల శాస్త్ర చికిత్సల సంఖ్యను పెంచాలన్నారు నెలకు 250 వీధి సునకాలకు శాస్త్ర చికిత్సలు నిర్వహించి రాబిస్ వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు చికిత్సలు అనంతరం వీధి సునకాల విశ్రాంతి తీసుకునే బ్యారెట్ల సంఖ్య 30 కి పెంచడం జరిగిందని తెలియజేశారు.