పూతలపట్టు: ఐరాల మండలంలో గార్గేయ నది ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో వర్షాల కారణంగా గార్గేయ నది ఉప్పొంగింది. ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా నీరు రహదారిపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు జెసిబి సహాయంతో బ్రిడ్జి కింద చేరుకున్న చెత్తను తొలగించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. అయితే నదిలో ఇంతకుముందు జరిగిన ప్రమాదాల కారణంగా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.