డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు, అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. బాబా సాహెబ్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం ఒంగోలు నగరంలోని హెచ్.సి.ఎం. సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రితో పాటు కలెక్టర్ , ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు, నగర మేయర్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.