ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ నగర్ నందు జలసురక్ష సేవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హెడ్ రెగ్యులేటర్ ట్యాంకును స్వయంగా ఎక్కి సందర్శించారు. ట్యాంక్ పరిశుభ్రత వాటి పరిసరాలను పరిశీలించారు. నీటిని పొదుపుగా వాడి భవిష్యత్తులో ఎటువంటి కొడత లేకుండా ఉండేలా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.