కథలాపూర్: దుంపేట ఊరచెరువుకు గండి.. వృథాగా పోతున్న నీరు.. ప్రజలకు ప్రయాణికులకు సూచన చేసిన పోలీసు,రెవెన్యూ అధికారులు
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామ శివారులోని ఊరచెరువుకు బుధవారం సాయంత్రం గండిపడడంతో నీరంతా వృథాగా పోతుంది. ఈ నీరు ఉధృతంగా పారడంతో దూలూరు- కథలాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒర్రె వద్దకు రెవెన్యూ అధికారులు,పోలీసులు చేరుకొని ప్రజలను అప్రమత్తం చేశారు. నీటి ఉధృతి తగ్గేవరకు ఒర్రెను దాటే ప్రయత్నం చేయవద్దని వారు ప్రజలకు సూచించారు.