నిర్మల్: జిల్లా కేంద్రంలోని సిటి ఫంక్షన్ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాల ప్రధానోత్సవం, హాజరైన కలెక్టర్, ఎమ్మెల్యే
Nirmal, Nirmal | Sep 17, 2025 నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిటి ఫంక్షన్ హాల్‌లో బుధవారం సాయంత్రం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, కలెక్టర్ కు ఎన్ సి సి విద్యార్థులు ఘన స్వాగతం పలికి, గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అపారమైనదని తెలిపారు. సమాజ అభివృద్ధికి విద్యనే మూలమని, ప్రతి విద్యార్థిలోని ప్రతిభను వెలికితీయడానికి గురు