తగరకుంటలో ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం తగరకుంట లో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి తగరకుంటకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగంలో డాక్టర్ శ్రీనివాస్ నాయక్ నాగరాజు ను పరిశీలించగా నాగరాజుకు కాలుకు 35% కాలిపోయినదని అత్యవసర విభాగం వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.